-->

సింగరేణి కార్మికులకు 36 శాతం లాభాల వాటా చెల్లించాలి TBGKS

 

సింగరేణి కార్మికులకు 36 శాతం లాభాల వాటా చెల్లించాలి TBGKS

సింగరేణి కార్మికులకు 36 శాతం లాభాల వాటా చెల్లించాలి TBGKS

కొత్తగూడెం: 2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కాలరీస్ సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, ఎలాంటి మినహాయింపులు లేకుండా లాభాల్లో 36 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో కొత్తగూడెం జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మికుల కృషి కీలకమని పేర్కొన్నారు. సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను స్పష్టంగా ప్రకటించి, లాభాల వాటాలో ఎలాంటి కోతలు లేదా మినహాయింపులు లేకుండా 36 శాతం వాటాను కార్మికులకు వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ లీగల్ అడ్వైజర్ జీకే సంపత్, సెంట్రల్ కమిటీ నాయకులు బోరింగ్ శంకర్, కాగితపు విజయ్ కుమార్, ఎంటెక్ మహేందర్, విద్యాసాగర్, రాజ్ కుమార్, కుమార్, పూర్ణ, రాములు, అరె దివ్య, నరేష్, హైమద్, పాషా తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.