సింగరేణి కార్మికులకు లాభాల వాటా 36 శాతం చెల్లించాలి TBGKS వినతి పత్రం
సింగరేణి కార్మికులకు లాభాల వాటా 36 శాతం చెల్లించాలి TBGKS వినతి పత్రం
టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో జేవీఆర్ ఓపెన్‌కాస్ట్ మైన్ మేనేజర్‌కు వినతి పత్రం
సత్తుపల్లి: సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన వాస్తవ లాభాల ఆధారంగా కార్మికులకు 36 శాతం లాభాల వాటా వెంటనే ప్రకటించి, ఎలాంటి మినహాయింపులు లేకుండా చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) డిమాండ్ చేసింది.
ఈ మేరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య సూచనల మేరకు సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్‌కాస్ట్ మైన్ మేనేజర్ రాజేశ్వర్ రావుకు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణికి వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించాలని, లాభాల లెక్కల్లో ఎలాంటి మినహాయింపులు చేయకుండా వాస్తవ లాభాలను పరిగణనలోకి తీసుకోవాలని నాయకులు కోరారు. ఆ లాభాల్లో 36 శాతం వాటాను సింగరేణి కార్మికులకు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మికుల శ్రమ, కృషి కీలకమని, సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు న్యాయమైన వాటా అందేలా చర్యలు తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు. లాభాల వాటాను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రకటించి కార్మికులకు చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీజీబీకేఎస్ నాయకులు చంద్రశేఖర్, రఘువీర్, పి.పి. రాజు, హరికుమార్, పిచ్చయ్య, విజయ్ కుమార్, దయాకర్, హుస్సేన్, లింగమూర్తి, శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, రవికుమార్, మోహన్, బి. వెంకటేశ్వర్లు, సయ్యద్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment