-->

సంచార ముస్లింలకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి

 

బీసీ-ఈ 1-14 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

సంచార ముస్లింలకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి

బీసీ-ఈ 1-14 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

కరీంనగర్, అక్టోబర్ 6: సంచార ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం (బీసీ-ఈ 1-14) డిమాండ్ చేసింది. ఈ మేరకు కరీంనగర్‌లో సంఘం ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు.

సంఘం ఫౌండర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షబ్బీర్, రాష్ట్ర కోశాధికారి ఎండీ షాదుల్లా, సలహాదారు వాసీమ్ అహ్మద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సంచార ముస్లిం వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో గౌరవ అధ్యక్షులు మౌలా హుస్సేన్, జిల్లా అధ్యక్షులు ఎస్డీ అబ్దుల్లా, ఉపాధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, సోహెల్, సెక్రటరీ ఎండీ రియాజ్, కోశాధికారి ఎండీ మాలాంగ్, జాయింట్ సెక్రటరీలు నబీ అజమాత్, షైక్ సలీం తదితరులు పాల్గొన్నారు.

హామీలను అమలు చేయాలని తీర్మానం

సంచార ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, విద్యా, ఉపాధి అవకాశాలు సంచార ముస్లింలకు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి

సంఘం ఫౌండర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షబ్బీర్ మాట్లాడుతూ.. సంచార ముస్లింల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

రాష్ట్ర కోశాధికారి ఎండీ షాదుల్లా మాట్లాడుతూ.. బీసీ-ఈ రిజర్వేషన్ పరిధిలోని 14 ఉపకులాల ప్రజలు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని అన్నారు. సంచార ముస్లింల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంచార ముస్లిం వర్గాల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి, సామాజిక సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం భవిష్యత్‌లో ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సంచార ముస్లిం వర్గాల ప్రజలు, సంఘ నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Blogger ఆధారితం.