వందమంది వయోవృద్ధుల ముఖాల్లో ఆనందం నింపిన ఎస్.జె.డబ్ల్యూ.హెచ్.ఆర్.సి
వందమంది వయోవృద్ధుల ముఖాల్లో ఆనందం నింపిన ఎస్.జె.డబ్ల్యూ.హెచ్.ఆర్.సి
షాద్నగర్: మానవత్వం, సేవాభావమే లక్ష్యంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎస్.జె.డబ్ల్యూ.హెచ్.ఆర్.సి) ఆధ్వర్యంలో షాద్నగర్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. సంస్థ నేషనల్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది డా. కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాలతో, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఎండి. సాధిక్ అలీ సూచనల మేరకు ఎఫ్.సి.ఎన్ ఫౌండేషన్లో సుమారు 100 మంది వయోవృద్ధులకు అల్పాహారం, పండ్లు, పట్టు వస్త్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి అవసరమైన ఆహారాన్ని అందించడంతో పాటు పట్టు వస్త్రాలను అందించి ఆప్యాయతను చాటుకున్నారు. వయోవృద్ధుల పట్ల ఎస్.జె.డబ్ల్యూ.హెచ్.ఆర్.సి చూపుతున్న సేవాభావాన్ని ఎఫ్.సి.ఎన్ ఫౌండేషన్ సిబ్బంది అభినందించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఎండి. సాధిక్ అలీ మాట్లాడుతూ “పదవుల కంటే ప్రజాసేవ గొప్పది. ఆకలిని తీర్చడం, వృద్ధులకు అండగా నిలవడం నిజమైన మానవత్వం” అని పేర్కొన్నారు. సమాజంలోని వయోవృద్ధులకు తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి ఎం. లక్ష్మీకాంత్, జిల్లా వైస్ చైర్మన్ వి. గిరి ప్రసాద్, మహబూబ్నగర్ మండల చైర్మన్ రాఘవేంద్ర, రాజేంద్రనగర్ మండల చైర్మన్ వి. దశరథం, నంద్యాల టౌన్ చైర్మన్ ఎం. రమాకాంత్, సిరిసిల్ల మండల చైర్మన్ శారద, సిరిసిల్ల టౌన్ చైర్మన్ సునీత, ఉట్కూరు మండల చైర్మన్ కళింపాషాతో పాటు పలువురు ఎస్.జె.డబ్ల్యూ.హెచ్.ఆర్.సి సభ్యులు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ ఎఫ్.సి.ఎన్ సంస్థ సంరక్షకులు తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఎండి. సాధిక్ అలీని శాలువాతో ఘనంగా సన్మానించారు.
సమిష్టి సేవా సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం వయోవృద్ధుల్లో ఆనందాన్ని నింపింది. సమాజంలోని వృద్ధుల పట్ల గౌరవం, ఆప్యాయత, సేవాభావాన్ని చాటుతూ ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచింది.

Post a Comment