బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సబిత సమక్షంలో ఉద్రిక్తత!
మహేశ్వరంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సబిత సమక్షంలో ఉద్రిక్తత!
**మహేశ్వరం:** మహేశ్వరంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో కార్యక్రమం ఒక్కసారిగా గందరగోళంగా మారింది.
కార్యక్రమంలో కేఎల్ఆర్, చిగురింత పారిజాతం వేదికపై కూర్చోవడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ హోదాలో వారు వేదికపై కూర్చున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు. మరోవైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే చోటుచేసుకున్న ఈ పరిణామాలు మహేశ్వరం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Post a Comment