మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పెయింట్ షాపులో ఎగసిపడుతున్న మంటలు!

హైదరాబాద్ మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పెయింట్ షాపులో ఎగసిపడుతున్న మంటలు!


హైదరాబాద్ మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పెయింట్ షాపులో ఎగసిపడుతున్న మంటలు!

**హైదరాబాద్:** నగరంలోని మియాపూర్ ప్రధాన రహదారిపై శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై ఉన్న ఓ పెయింట్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణమంతా వ్యాపించాయి.

దుకాణం పైభాగంలో నేమ్ బోర్డు ఏర్పాటు చేసేందుకు సిబ్బంది వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెల్డింగ్ సమయంలో వెలువడిన నిప్పురవ్వలు దుకాణంలోని పెయింట్ డబ్బాలు, రసాయనాలపై పడటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో పాటు దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా మియాపూర్ ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Blogger ఆధారితం.