ఉప్పల్ ఐడీఏలో ఘోర ప్రమాదం.. హెరిటేజ్ ఫుడ్స్‌లో డ్రమ్ పేలి మహిళ మృతి! (వీడియో)
ఉప్పల్ ఐడీఏలో ఘోర ప్రమాదం.. హెరిటేజ్ ఫుడ్స్‌లో డ్రమ్ పేలి మహిళ మృతి! (వీడియో)
హైదరాబాద్: ఉప్పల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఐడీఏలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీ ప్రాంగణంలో డ్రమ్ ఒక్కసారిగా పేలడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. కంపెనీలో వ్యర్థాలను పారవేసేందుకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా డ్రమ్ పేలింది. ఈ ప్రమాదంలో పింకీ దేవి (36) అక్కడికక్కడే మృతి చెందింది. ఊహించని ఈ ఘటనతో కంపెనీ ప్రాంగణంలో విషాదం నెలకొంది.
మహిళ మృతితో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనతో ఉప్పల్ ఐడీఏ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, కంపెనీ యాజమాన్యం బాధ్యతపై అధికారులు విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment