మంత్రి శ్రీధర్ బాబు OSD పేరుతో భారీ మోసం.. రూ.50.87 లక్షలు స్వాహా!
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొలుగూరి రవికిరణ్ అనే వ్యక్తి మంత్రి ఓఎస్డీగా పరిచయం చేసుకుంటూ నకిలీ ఐడీ కార్డును తయారు చేసి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
టీచర్, అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నలుగురు బాధితుల నుంచి ఏకంగా రూ.50.87 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా ప్రభుత్వ వెబ్‌సైట్లను పోలిన నకిలీ పోర్టల్స్‌ను సృష్టించి బాధితులను నమ్మించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాల మోసం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment