-->

బోనాల జాతరకు భారీగా రూ. 20 కోట్లు నిధులు రిలీజ్ చేసిన తెలంగాణ సర్కారు

బోనాల జాతరకు భారీగా రూ. 20 కోట్లు  నిధులు రిలీజ్ చేసిన తెలంగాణ సర్కారు

 బోనాల జాతరకు భారీగా రూ. 20 కోట్లు  నిధులు రిలీజ్ చేసిన తెలంగాణ సర్కారు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

ఈ ఏటా బోనాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి రూ.20 కోట్లను మంజూరు చేశారని కూడా ఆమె వెల్లడించారు. బోనాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు సీఎం అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటిని కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మరికొన్ని రోజుల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో మంత్రి శనివారం సెక్రటేరియట్‌లోని తన కార్యాలయంలో సమీక్షను నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలోని ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేశారని ప్రకటించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793