-->

సైబరాబాద్ లో 27 మంది ఎస్ఐల బదిలీ

 
సైబరాబాద్ లో 27 మంది ఎస్ఐల బదిలీ

సైబరాబాద్ లో 27 మంది ఎస్ఐల బదిలీ

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 27 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్‌ మహంతి ఆదేశాలు జారీ చేశారు.

ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్‌ ఎస్‌ఐ జి.మనియామ్‌ కేపీహెచ్‌బీకి, కేపీహెచ్‌బీ ఎస్‌ఐ కె.సత్యనారాయణ మైలార్‌దేవుపల్లికి, అత్తాపూర్‌ ఎస్‌ఐ కె.నాగరాజు రాయదుర్గం ట్రాఫిక్‌కు, బాలానగర్‌ ఎస్‌ఐ అశోక్‌ లిగెపల్లి అత్తాపూర్‌కు, రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ పి.రవికిరణ్‌ ఎస్‌వోటీ బాలానగర్‌ జోన్‌కు, ఆర్‌జీఐఏ ట్రాఫిక్‌లో విధులు నిర్వహిస్తున్న టి.వెంకటేశ్వరావును మాదాపూర్‌ ట్రాఫిక్‌కు, సీసీఆర్‌బీలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌.మౌనికను పేట్‌బషీరాబాద్‌ పీఎస్‏కు, కేపీహెచ్‌బీ ట్రాఫిక్‌ ఎస్‌ఐ జి.శశిధర్‌ను ఐటీసెల్‌ సీపీఏ సైబరాబాద్‌కు, ఐటీ సెట్‌ సైబరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న సయ్యద్‌ నజీర్‌ మియాన్‌ను కేపీహెచ్‌బీకి బదిలీ అయ్యారు.

అలాగే ఐటీసెల్‌ సైబరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఈ.రూపను కేపీహెచ్‌బీకి, గచ్చిబౌలి ట్రాఫిక్‌లో విధులు నిర్వహిస్తున్న ఎ.కృష్ణను మైలార్‌దేవ్‌పల్లికి, చెవెళ్ల నుంచి ఆర్‌. వీరభ్రహ్మమ్‌ను గచ్చిబౌలి ట్రాఫిక్‌కు, మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌ఐ నయీమ్‌ హుస్సేన్‌ను కేపీహెచ్‌బీ ట్రాఫిక్‌కు, సీసీఆర్‌బీకి చెందిన కె.రాజేశ్వర్‌ రెడ్డి మియాపూర్‌కు, మియాపూర్‌ ఎస్‌ఐ ఎం.రాజు సీసీఎస్‌ బాలానగర్‌ జోన్‌, పేట్‌బషీరాబాద్‌ ఎస్‌ఐ జి.సరిత కేపీహెచ్‌బి ట్రాఫిక్‌కు, సీసీఎస్‌ బాలానగర్‌ ఎస్‌ఐ దాసరి బాల్‌రాజ్‌ ఎస్‌వోటీ మాదాపూర్‌ జోన్‌, ఎస్‌ఓటీ మాదాపూర్‌ జోన్‌ ఎస్‌ఐ బి.నర్సింహారెడ్డి మియాపూర్‌కు, ఎస్‌ఓటీ బాలానగర్‌ జోన్‌ ఎస్‌ఐ మామిడి కిషోర్‌ రాజేంద్రనగర్‌కు, రాయ్‌దుర్గం ట్రాఫిక్‌లో విధులు నిర్వహిస్తున్న మలావత్‌ పరుషురామ్‌ను శామీర్‌పేట్‌ పీఎ్‌సకు బదిలీ చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793