8 కేజీల గంజాయి స్వాధీనం, ముగ్గురు అరెస్ట్*...
*8 కేజీల గంజాయి స్వాధీనం, ముగ్గురు అరెస్ట్*...
సూర్యాపేట పరిధిలో 8 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో డిఎస్పి రవి వివరాలు తెలిపారు.గురువారం ఖమ్మం రోడ్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుండి గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. సిఐ రాజశేఖర్ ఎస్సైలు మహేంద్ర నాథ్, లవకుశ, కానిస్టేబుల్స్ కృష్ణ, కర్ణాకర్, సైదులు, ఆనంద్, మధు ఉన్నారు.

Post a Comment