-->

ఇంటిపై ఆడుకుంటున్న 9 ఏళ్ళ బాలికపై ఫార్మాసిస్ట్ అత్యాచారం

 

ఇంటిపై ఆడుకుంటున్న 9 ఏళ్ళ బాలికపై ఫార్మాసిస్ట్ అత్యాచారం

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో*

ఇంటిపైన ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని వాగుమల్లారంలో చోటు చేసుకుంది.

*ఆలస్యంగా వెలుగులోకి*

స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పినపాక మండలం జానంపేట పంచాయితీలోని ప్రభుత్వ పీహెచ్సీలో గాడిద శ్రీనివాస్ అనే వ్యక్తి ఔట్సోర్స్ ఫార్మసిస్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఉద్యోగ రీత్యాపరంగా శ్రీనివాస్ నిత్యం మణుగూరు టు పినపాక ట్రావెలింగ్ చేస్తున్నాడు.

అయితే శ్రీనివాస్ బుధవారం రోజు వాగుమల్లారంలోని ఓ బెల్ట్ షాప్ కి వెళ్ళాడు. మద్యం పుచ్చుకొని సిగిరెట్ తాగడం కోసం బెల్ట్ షాప్ ఇంటిపైకి వెళ్ళాడు. బెల్ట్ షాప్ పక్కన ఓ మహిళ కిరాయికి ఉంటుంది. ఆమహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు ఇంట్లో ఫోన్ చూస్తుండగా…పాప ఇంటిపైన ఆడుకుంటుంది. ఇది గమనించిన శ్రీనివాస్ పాపతో అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు గమనించి పాప తల్లికి చెప్పగా…నిందుతుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పాప తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793