-->

టీవీ దొంగిలించిన వ్యక్తికి జైలు శిక్ష

టీవీ దొంగిలించిన వ్యక్తికి జైలు శిక్ష

టీవీ దొంగిలించిన వ్యక్తికి జైలు శిక్ష

కొత్తగూడెం లీగల్:: ఎల్ఈడి టీవీని దొంగిలించిన వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి(ఫుల్ అడిషనల్ చార్జ్ మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్) బత్తుల రామారావు శనివారం తీర్పు చెప్పారు.

కేసు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం రామ టాకీస్ ఏరియా కు చెందిన రాజు 19-02-2024 న ఉదయం రామవరం వెళ్లి సాయంత్రం  తిరిగి వచ్చేసరికి తన ఇంటి తలుపులు తీసి ఉండి సామానులు చిందరవందరగా పడి ఉన్నవని, గోడకు ఉన్న" ఎల్ఈడి టీవీ 32" కనిపించలేదని దాని విలువ 15 వేల రూపాయలు ఉండునని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై జి.విజయ కేసు నమోదు చేసుకుని, తన దర్యాప్తులో చుంచుపల్లి మండలం పెనుబెల్లికి చెందిన ఎనుముల సాంబశివరావు వద్ద రికవరీ చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 

కోర్ట్ లో ఏనుముల సాంబశివరావు నేరము అంగీకరించాడు. జడ్జి ఎనుముల సాంబశివరావుకు ఐదు నెలల జైలు శిక్ష మరియు 200 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కొత్తగూడెం వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం కర్ణాకర్, (కోర్టు డ్యూటీ ఆఫీసర్) పిసి             ఏ. నరసింహారావు సహకరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793