ముగిసిన మంత్రుల జిల్లా పర్యటన పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
ముగిసిన మంత్రుల జిల్లా పర్యటన పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
▪️పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనచేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల
▪️పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను పరమార్శించిన మంత్రుల బృందం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావుల భద్రాద్రి జిల్లా పర్యటన ముగిసింది. విద్యానగర్ లో డిస్టిక్ మినరల్ ఫండ్స్ రూ.4కోట్లతో చేపట్టిన పనులకు, పోస్ట్ ఆఫీసు సమీపంలో అమృత్ 2.0 నిధులు రూ.124 కోట్లతో కొత్తగూడెం ప్రజల దాహర్తిని తీర్చేందుకు మున్సిపాలిటికి శాశ్వత మంచినీటి సరఫరా పథకం పనులకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలసి శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కలెక్టరేట్ లో వర్షకాల నేపథ్యంలో గోదావరి వరదలపై తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. మాతృవియోగం పొందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను పరమార్శించిన అనంతరం ఇటీవల స్వర్గస్థులైన పద్మశ్రీ ఆవార్డు గ్రహిత సకిన రాంచంద్రయ్య కుటుంబ సభ్యులను పరమార్శించారు.
ఈ కార్యక్రమంలో కోరం కనకయ్య, రాందాస్ నాయక్, జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న), జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఎ పివో రాహుల్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment