తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్స్.
*ఇక తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్స్...*
హైదరాబాద్, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి చిల్లర భాదలు అంత ఇంత కాదు. నిత్యం సిబ్బందితో వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి వాటికి అవకాశం లేకుండా చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ.
హైదరాబాద్ బండ్లగూడ డిపోలో 70బస్సుల్లో చేపట్టిన డిజిటల్ పేమెంట్స్ పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అవడంతో తొలుత గ్రేటర్ పరిధిలోని 2900 బస్సుల్లో, దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తుంది.
దీంతో ప్రయాణికులు యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బస్సు టికెట్లు తీసుకుని ప్రయాణం చేయవచ్చు. ఇక కండక్టర్లకు చిల్లర బాధ తప్పుతుంది.

Post a Comment