-->

పురుగులమందు డబ్బాతో చెట్టెక్కిన రైతు

పురుగులమందు డబ్బాతో చెట్టెక్కిన రైతు

 *పురుగులమందు డబ్బాతో చెట్టెక్కిన రైతు..* 

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తన భూమి సమస్యను పరిష్కరించాలంటూ  ఓ..రైతు చెట్టు ఎక్కిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుడు భూక్య బాలు చెప్పిన వివరాల ప్రకారం పెద్దనాగారం జీపీ పరిధిలోని హజ్ తండ* కు చెందిన తనకు రెండు ఎకరాల భూమి ఉండగా తన భూమిని భూక్య హరిలాల్, భద్రు ల పేరిట పట్టా చేయడంతో తను సర్వేకు అప్లై చేసుకొనగా సర్వేయర్ వచ్చి సర్వే చేసే క్రమంలో అడ్డు తగిలినట్లు తెలిపాడు.

 తన భూమిని తనకి ఇప్పించాలంటూ ఎన్నోసార్లు తహశీల్దార్ కు విన్నవించుకున్నట్లు తెలిపాడు.

 ఇప్పటివరకు తన భూమిని తన పేరిట చేయకపోవడంతో తనకు అన్యాయం జరిగుతుందని బాధితుడు బాలు తెలిపాడు. తహశీల్దార్ నాగరాజు ను వివరణ కోరగా సర్వేయర్ వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు తెలియ చేయనున్నట్లు తెలిపాడు. తహశీల్దార్, పోలీసులు భూ సమస్యను పరిష్కరించుతామంటూ హామీ ఇవ్వడంతో రైతు చెట్టుపైనుండి కిందికి దిగాడు.*

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793