ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి కొత్తగూడెం మున్సిపల్ పలు సమస్యలపై వినతి పత్రం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి కొత్తగూడెం మున్సిపల్ పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చిన చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి.
కొత్తగూడెం పురపాలక సంఘమునకు అమృత్ పథకం ద్వారా రూ.124.48 కోట్ల నిధుల తో మంజూరు కాబడిన మంచినీనిటి సరఫరా అభివృద్ధి పథకము శంఖుస్థాపన కార్యక్రమము సందర్భంగా కొత్తగూడెంకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క, ఆర్ధిక ,ప్రణాళికమరియు విధ్యుత్ శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖా మాత్యులు, కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం శాసన సభ్యులు కొత్తగూడెం మున్సిపల్ అభివృద్దికి సంబందించిన ఈ కింది అంశములపై కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కోరుట జరిగినది.
1. గతంలో స్వంత గృహములు లేని నిరు పేదలకు లాటరీ పద్దతిన కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి యించి, వారికిఅప్పగించాలని కోరుట జరిగినది.
2. కొత్తగూడెం మున్సిపాలితో నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన 75.00 చ.గజాల ఖాళీ స్థలములో ఇందిరమ్మ పథకం ద్వారా గృహాలు మంజూరు చేయించి వారికి మౌళిక సదుపాయాలు విద్యుత్, నీరు, డ్రెయిన్ లు ,రోడ్లు మొదలగు వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేయుట జరిగినది.
3. కొత్తగూడెం పట్టణంలోజి.ఓ. క్రమబద్దీకరణ పట్టాల కొరకు తరఖాస్తూ చేసుకొని 25% సొమ్ము చెల్లించిన వారి పెండింగ్ దరఖాస్తులు పరిశీలించి వెంటనే పట్టాలు జారీ చేయుటకు చర్యలు తీసుకోవలసినది గా కోరుట జరిగినది.
4.నిరుపేద లబ్దిదారులకు రేషన్ కార్డులు,పెన్షన్ మంజూరు చేయించుట కొరకు కోరడమైనది.
5. పట్టణము లోని 27వ వార్డు నందు ఇండోర్ స్టేడియంకు స్థలం కేటాయించబడి నిర్మాణము కొరకు డి.యమ్.యఫ్.నిధులు నుండి నిధులు మంజూరు కాబడియున్నవి, అట్టి నిర్మాణ పనులు ప్రారంబింఛి పూర్తి చేయుటకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశములు జారీ చేసి క్రీడాకారులకు ఉపయోపడేవిధంగా సహకరించ గలరని విజ్ఞప్తి చేయుట జరిగినది.
6. కొత్తగూడెం మున్సిపాలిటి నందు కమ్యూనిటి హాళ్ళు నిర్మాణము కొరకు నిధులు మంజూరు చేయుటకై కోరుట జరిగినది.
7. కొత్తగూడెం పట్టణము లో జాతీయ రహదారి ఇరువైపులా సైడ్ డ్రైనేజీల నిర్మాణము చేయుటకు కోరుట జరిగినది.
8. కొత్తగూడెం పట్టణ కూలీలైన్ (రైతు బజార్)నందు నిర్మాణము లో ఉన్నటు వంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు గాను తగు చర్యలు తీసుకొనుటకు కోరుట జరిగినది.
9. కొత్తగూడెం మున్సిపాలిటి పరిధిలో ఉన్న సింగరేణి ఖాళీ స్థలాలు కొత్తగూడెం మున్సిపాలిటి కి స్వాధీన పర్చుటకు తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరుట జరిగినది.
10. కొత్తగూడెం మున్సిపల్ పరిధి లోని రామవరం పరిధిలో ఉన్నటువంటి (7) మున్సిపల్ వార్డుల యందు నివాసము ఉంటున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించుట కొరకు తగిన చర్యలు తీసుకోవలసినదిగా విజ్ఞప్తి చేయుట జరిగినది.

Post a Comment