సచివాలయానికి మొదటిసారి రాబోతున్న పవన్ కళ్యాణ్
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి పనులను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగా…ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి పవన్ రాబోతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి పవన్ చేరుకుంటారు.
రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ను పవన్ పరిశీలిస్తారు. పవన్ కల్యాణ్ అమరావతికి వస్తున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Post a Comment