ఫ్లైవుడ్ షీట్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా
ఫ్లైవుడ్ షీట్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాకొట్టిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం, మద్రాసు నుంచి ఒక లారీ 30 టన్నుల బరువు కలిగిన ప్‌లైవుడ్ షీట్లను లోడ్ చేసుకుని కృష్ణలంకలోని ప్రేమ్‌సాయి ప్‌లైవుడ్ గోడౌన్‌కు ఆదివారం సాయంత్రం బయలుదేరింది. ఆ సమయంలో రోడ్డు మీద ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గోడౌన్ యజమాని ప్‌లైవుడ్ షీట్లను తీసుకెళ్లేందుకు అశ్రద్ధ చేయడంతో సాయంత్రం వరకు ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. నెమ్మదిగా సాయంత్రానికి ప్‌లైవుడ్ షీట్లను ఆటోల ద్వారా గోడౌన్‌కు తరలించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో జరగకుండా అనుమతి లేని పెద్ద పెద్ద లారీలను కృష్ణలంకలోకి ప్రవేశించకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment