భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్‌భమ్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో పెద్దమొత్తంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అశుతోశ్ శేఖర్ చెప్పారు. ఆప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.

Post a Comment