నంద తండా రోడ్డు లేక నడిచే పరిస్థితి లేదు ప్రజల ఇక్కట్లు
నంద తండా రోడ్డు లేక నడిచే పరిస్థితి లేదు ప్రజల ఇక్కట్లు
చుంచుపల్లి మండలం నంద తండా గ్రామ పంచాయితీ హౌసింగ్ బోర్డు, శ్రీ వేంకటేశ్వర హౌసింగ్ బోర్డు కాలనీ ఏడవ వార్డు రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది.
వర్షం వచ్చిందంటే రోడ్డు అంత బుర్దమయం. కనీసం ద్విచక్ర వాహనం పోయే పరిస్థితి లేదు, అంబులెన్స్ రావాలన్న కష్టమే, స్కూళ్ళు మొదలైనవి చిన్న పిల్లలు స్కూల్ కు వెళ్లలేని పరిస్థితి, ఆటోలు రావడం కుడా కష్టమే, కాలినడకన వెళ్లే మహిళలు, వృద్దులు కాలినడకన వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొత్తగూడెంలో హైవే రోడ్డుకి కూత వేటు దూరంలోనే ఉన్న ఈ నంద తండా పంచాయతీ.
అసలే వర్షాకాలం సీజన్ వ్యాధులు అవకాశం ఎక్కువ ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి ఉన్నది. దయచేసి మా ఏడవవార్డుకి రోడ్లు వేయగలరని కాలనీ ప్రజలు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును వేడుకుంటున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే మా పంచాయతీపై దృష్టిసారించి కనీస సౌకర్యాలు రోడ్డు సైడ్ కాలువలు నిర్మించాలని అధికారులను ఆదేశించాలని వేడుకుంటున్న పంచాయతీ వార్డు ప్రజలు.

Post a Comment