-->

వేగంగా రోడ్డు దాటుతున్న పెద్దపులిని డీ కొట్టిన కారు

వేగంగా రోడ్డు దాటుతున్న పెద్దపులిని డీ కొట్టిన కారు


నెల్లూరు జిల్లా,మర్రిపాడు మండలం కదిరి నాయుడు పల్లి సమీపంలో రహదారి పై పెద్దపులిని ఢీ కొట్టిన కారు పులి అని కారులోని వారు ఇచ్చిన సమాచారం)

నెల్లూరు నుండి ముంబై హైవే పై వెళ్తున్న AP 39 UD 5963 టయోటా ఇటియోస్ కారు రహదారిపై వస్తున్న సమయంలో కదిరినాయుడు పల్లి సమీపంలో వేగంగా రోడ్డు దాటడానికి వచ్చిన పులిని కారు ఢీకొట్టినట్టు కొంత దూరం పులిని అలాగే ఈడ్చుకెళ్లి నట్టు, ఈ ప్రమాదంలో పులికాళ్ళకు తీవ్ర గాయాలైనట్టు కాసేపటికి పులి గాయాలతో అడవిలోకి పారిపోయినట్టు కారులో ప్రయాణిస్తున్న వారు పోలీసులకు తెలియజేశారు.

 సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు కారును ఢీకొట్టింది పులినా లేదా మరేదైనా జంతువునా అనే విషయం కోసం అడవిలో  గాలింపు చేపట్టారు...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793