-->

లోన్ తీసుకొని చనిపోతే మళ్ళీ ఆ డబ్బులు కట్టక్కరలేదు

 

లోన్ తీసుకొని చనిపోతే మళ్ళీ ఆ డబ్బులు కట్టక్కరలేదు

మహిళలకు గుడ్ న్యూస్. ఇప్పటికే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు లోన్ తీసుకొని, ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడుతున్న విషయం తెలిసిందే.

అయితే వారికి మరింత చేయుతను, సపోర్టు అందివ్వడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

తమ రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్ అందిస్తోంది. డ్వాక్రా గ్రూప్‌లో సభ్యురాలిగా ఉన్న మహిళ ఏదైనా కారణంతో మరణిస్తే వారి పేరు మీద ఉన్న మొత్తం మాఫీ అయ్యేలా వారి పేరిట బీమా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్లు సమాచారం.

 అంటే ఆ మహిళ కుటుంబంపై ఎలాంటి భారం పడకుండా ఆ మొత్తం లోన్ అమౌంట్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుంది. డ్వాక్రా రుణాలు మాత్రమే కాకుండా, స్త్రీ నిధి ద్వారా లోన్ తీసుకున్నా, ఈ బీమా వర్తించనున్నదంట. ఇక లోన్ తీసుకున్న మహిళ ఏ కారణంతోనైనా చనిపోతే వారికి తీసుకున్న లోన్ రూ.2 లక్షల వరకు మాఫీ అవుతుంది. అలాగే, ప్రమాదవశాత్తు మహిళా గ్రూప్ సభ్యురాలు చనిపోతే యాక్సిడెంటల్ బీమా కింద రూ.10 లక్షల వరకు మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఒక వేళ మహిళ గ్రూప్‌గా లోన్ తీసుకుంటే మాత్రం ఆ మొత్తం డబ్బులను ఆమె కుటుంబమే చెల్లించాలి. దానికి బీమా వర్తించదు

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793