ఈనెల 23న "అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్
ఈనెల 23న "అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్" లో అందరూ పాల్గొని క్రీడా స్పూర్తి ని చాటాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
కొత్తగూడెం : ఈ నెల 23వ తేదీన అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్బాన్ని పురస్కరించుకొని బద్రాద్రి కొత్తగుడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అద్వర్యంలో జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే ఒలింపిక్ డే రన్ టి షర్ట్ లను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన క్యాంపు ఆఫిస్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్బముగా అయన మాట్లడుతూ యువత క్రిడలవైపు తమ దృష్టి ఉంచాలని , ఒలింపిక్స్ లో మన దేశానికి ప్రతినిత్యం వహించి మెడల్ సాధించటానికి నిరంతరమూ క్రీడల వైపు కృషి చేయలని ,ఒలింపిక్స్ క్రీడల లో మన దేశం తరుపు పాల్గునటం గొప్ప అనుభూతిని ఇస్తుందని ,ఈ ఒలింపిక్ డే రన్ లో రన్ చేయటం ద్వారా ప్రతి క్రిడాకారుడు ,విద్యార్థి ఒలింపిక్స్ క్రీడల వైపు చిన్న తనము నుండి స్పూర్తి పొంది మంచి క్రిడాకారులుగా మారతారని ఆశించారు.
కావున జిల్లా లొని ప్రతి ఒక్కరు ఈ ఒలింపిక్ డే రన్ లో ఫల్గుని ఒలింపిక్ క్రీడా స్పూర్తి ని చాటాలని కొరారు .ఈ సందర్బముగా భద్రాద్రి కొత్తగుడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి కె.మహిధర్ మాట్లడుతూ ఒలింపిక్ డే రన్ 20 వ తేదీ దమ్మపేటలో ప్రారంభమయి 21వ తేదీ భద్రచలం మరియు మణుగురు మీదిగా 22వ తేదీ ఇల్లందు, 23వ తేదీ కొత్తగుడెంలో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రము లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇండియన్ స్టయిల్ రెస్లింగ్ అసోసియేషన్ సెక్రటరి బరిగెల భూపేష్, జిల్లా బేస్ బాల్ అధ్యకులు జూన్సన్ సుధాకర్, సెక్రటరి ఇల్లుటూరి ప్రవీణ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జాయంట్ సెక్రటరి పి .నాగేందర్, పి ఈ టి లు అక్బర్, ఇందు, సామర్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment