తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్
సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న ప్రమాదంలో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే గాక అనేక మంది గాయపడ్డారని తెలిపారు.
ప్రమాద దృశ్యాలు బాధాకరమని, ఈ దుఃఖ సమయంలో, మేము ప్రతి ఒక్కరికీ మా సంఘీభావం మరియు సంతాపాన్ని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అంతేగాక బాధితులకు తక్షణమే పూర్తి నష్టపరిహారం ప్రకటించాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను పూర్తిగా దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను 'కెమెరాతో నడిచే' స్వీయ ప్రచార వేదికగా ఎలా మార్చేసిందో నొక్కి చెప్పడం బాధ్యతయుతమైన ప్రతిపక్షంగా మా కర్తవ్యం! అని అన్నారు.
నేటి విషాదం ఈ కఠోర వాస్తవికతకు మరో నిదర్శనంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మా ప్రశ్నలతో మీరు చేసిన తప్పులను నిరంతం గుర్తు చేస్తామని, భారతీయ రైల్వేలను నేరపూరితంగా వదిలేసినందుకు మోడీ ప్రభుత్వాన్ని జవాబుదారిగా చేస్తామని ఖర్గే అన్నారు.

Post a Comment