-->

బడికి డుమ్మా... మహిళ తో ఉపాధ్యాయుడి రాసలీలలు

బడికి డుమ్మా... మహిళ తో ఉపాధ్యాయుడి రాసలీలలు

బడికి డుమ్మా మహిళతో ఉపాధ్యాయుడి రాసలీలలు 

రోజురోజుకు వివాహేతర సంబంధాలు శృతిమించిపోతున్నాయి. విద్యార్థులకు మంచి, చెడులు చెప్పాల్సిన ఉపాధ్యాయిడే తప్పుదోవ పట్టాడు.

బడికి డుమ్మా కొట్టి మరీ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఉపాధ్యాయుడిని గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నెమలిపేటలో ఉన్న ఐటీడీఏ పాఠశాలలో రాందాస్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రోజూ స్కూల్‌కు వచ్చి పాఠాలు చెప్పాల్సిన అతడి బుద్ధి పక్కదారి పట్టింది. స్థానికంగా ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పాఠశాలకు రాకుండా మహిళతో ఉంటున్నాడు.

 ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు, సదరు మహిళ భర్త.. రాందాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. విషయం తెలుసుకున్న ఎంఈవో కృష్ణయ్య, సీఐ జితేంద్ర అక్కడికి చేరుకుని రాందాస్‌ను విడిపించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793