పవర్ లూమ్ వైపని కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య
పవర్ లూమ్ వైపని కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో పవర్ లూమ్ వైపని కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.
మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో స్థానికులు వెల్లడించిన ప్రకారం ఇందిరమ్మ కాలనీకి చెందిన ముదిగొండ నరేష్ పవర్ లూమ్ వైపని కార్మికుడిగా పని చేస్తున్నాడు.
గత కొద్ది రోజుల నుండి వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉండడంతో ఎలాంటి పని దొరకక మద్యానికి బానిసై, జీతం పై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో నైలాన్ పట్టితో గోడకు ఉన్నా ఇనుప చువ్వకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య స్వాతి, తల్లిదండ్రులు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment