బాలికను బెదిరించి బాబాయి అత్యచారం
బాలికను బెదిరించి బాబాయి అత్యచారం
అండగా ఉండాల్సిన బాబాయే, భార్య అక్క కూతురు పై అత్యాచారం చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆర్జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కాపుగడ్డలో నివాసం ఉంటున్న కుటుంబం రోజువారి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
అయితే గత నెల రోజుల క్రితం ఇంటి పెద్ద మైనర్ బాలిక తండ్రి మృతి చెందడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ ఉంది.
20వ తేదీన కూలి పని నిమిత్తం తల్లి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలిక (14) పై బాలిక తల్లి చెల్లెలు భర్త వరుసకు బాబాయ్ పోతురాజు యాకేశ్ ఇంట్లోకి వెళ్లి బాలికపై బలవంతంగా అత్యాచారం చేశాడు. బాలిక అన్న నిందితుడు పోతురాజు యాకేష్ ను ఆదివారం ఇంట్లో ఉండగా డోర్ కు గడియ పెట్టి పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి వెళ్లి అరెస్టు చేసి నిందితులపై పోక్సో యాక్ట్, రేప్ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. మైనర్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు.

Post a Comment