HYD రౌడీ షీటర్ దారుణ హత్య వరుస హత్యాలతో ప్రజలు భయాందోళన
రౌడీ షీటర్ దారుణ హత్య వరుస హత్యాలతో ప్రజలు భయాందోళన
హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి రెయిన్ బజార్ కు చెందిన రౌడీ షీటర్ నజాబ్ అర్ధరాత్రి మలక్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద హోటల్ సవేరా ముందు దుండగులు వచ్చి కత్తులతో పొడిచి చంపేశారు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డీసీపీ స్నేహ మెహ్రా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాత బస్తీ లో వరుస హత్యలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Post a Comment