-->

సూర్యాపేట పాలిమర్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం

సూర్యాపేట పాలిమర్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం

 సూర్యాపేట పాలిమర్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి గ్రామ సమీపంలో ఉన్న జయశంకర్ పాలిమర్స్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాక్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా ఆ కంపెనీలో మంటలు భారీగా చెలరేగాయి. ఈ మంటల్లో పేపర్ ప్లేట్స్ కి సంబంధించిన వస్తువులు, ముడి సరుకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రెండు ఫైరింజన్ వాహనాలతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ కంపెనీ బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర నాయకుడిదిగా ప్రచారం సాగుతోంది.

మంటల్లో కాలి బూడిదైన సరుకుల విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందనేది స్థానికుల అంచనాగా తెలిసింది. సంబంధిత అధికారులు మాత్రం ఇంకా ప్రాథమికంగా అంచనా వేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793