-->

మధ్యాహ్న భోజన వంట కార్మికుల పలు సమస్యలపై ఎమ్మెల్యే కూనంనేని వినతి పత్రం

మధ్యాహ్న భోజన వంట కార్మికుల పలు సమస్యలపై ఎమ్మెల్యే కూనంనేని వినతి పత్రం

మధ్యాహ్న భోజన వంట కార్మికుల పలు సమస్యలపై ఎమ్మెల్యే కూనంనేని వినతి పత్రం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మధ్యాహ్న భోజన వంట కార్మికుల పెండింగ్ మెస్ బిల్లులు, పెంచిన వేతనాలు సత్వరం చెల్లించాలి. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో వంట కార్మికులకు రూ. 10 వేలు వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని విజ్ఞప్తి.

 తెలంగాణ రాష్ట్ర ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఈ క్రింది సమస్యలను పరిష్కరించవల్సిందిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వినతి పత్రం ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొనివేల్లి మా సమస్యలు పరిష్కరించాలని వంట కార్మికులు వినతి పత్రం ఇచ్చారు.

డిమాండ్స్:

1. వంట కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ మెస్ బిల్లులను, పెంచిన వేతనాలను సత్వరం చెల్లించాలి.

2. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా వంట కార్మికులకు రూ.10వేలు వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి.

3. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి. వంటపాత్రలను ఇవ్వాలి.

4. వంట సరకులను గ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. లేదా స్లాబ్ రేటు రూ.25లు చెల్లించాలి.

5. వయస్సు పైబడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 5లక్షలు ఇవ్వాలి.

6. ఎం.ఆర్.ఓ ద్వారా వంట కార్మికులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలి.

7. వంట కార్మికులకు సంవత్సరానికి 2 జతల యూనిఫాంను ఇవ్వాలి.

8. రాగిజావా అల్పాహారం అందించినందుకు గాను అదనపు వేతనం చెల్లించాలి.

9. వంట కార్మికులను అక్రమంగా తొలగించరాదు. ప్రమాద బీమా పథకం అమలు చేయాలి.

10. మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదు.

11. మధ్యాహ్న భోజన వంట కార్మికులను నాల్గవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793