మంత్రి పొంగులేటికి పుష్పాభిషేకం
మంత్రి పొంగులేటికి పుష్పాభిషేకం
మంత్రి పొంగులేటికి పుష్పాభిషేకం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు ప్రకటన చాలా సంతోషదాయకమని, రుణమాఫీ ప్రకటనలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ , సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆదివారం ఈ మేరకు సన్మానం చేశారు.
మండలంలోని అరేంపుల గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామసభలో కాంగ్రెస్ నాయకులు బండి జగదీష్ చింతమల్ల రవి తదితరులు పూలతో అభిషేకం నిర్వహించారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ కాంగ్రెస్ ఉంటుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Post a Comment