ఘనంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సంధర్బంగా సుజాతనగర్ మండల కేంద్రంలోకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుక సందర్బంగా టీపీసీసీ సభ్యులు నాగాసీతారాములు మాట్లాడుతూ గతంలో సీఎల్పీ నేతగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో మరియి పాదయాత్రల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన ఎండగట్టి, పేదలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, గెలుపుకు అహర్నిశలు కృషి చేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కీలక పాత్ర పోషించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క జన్మదినం సందర్భంగా అభినందనలు తెలిపారు.
ఈ జన్మదిన వేడుక కార్యక్రమంలో సుజాతనగర్ మండల అధ్యక్షులు చింతలపూడి.రాజశేఖర్, ఎంపీటీసీ కసనబోయిన.భద్రం, సొసైటీ చైర్మన్ మండే.హనుమంత రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు లింగం.పిచ్చి రెడ్డి, బాగం.మోహన్ రావు, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగార్జున, సొసైటీ డైరెక్టర్ చందర్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వీరాపురం. రామ లక్ష్మణ్, సేవాదళ్ మండల అధ్యక్షులు పూరేటి నరేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే అబీద్, కాంగ్రెస్ నాయకులు బత్తుల రమేష్, చిమట నాగేశ్వరావు, బోడ రవి, పార్థసారథి, కోటి,తేజావత్ శ్రీను, రాజేష్, ప్రహ్లాద్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment