-->

నడిమెట్ల శ్రీధర్ అహంకారంపై న్యాయమే గెలిచింది HMS రియాజ్ అహ్మద్

 

నడిమెట్ల శ్రీధర్ అహంకారంపై న్యాయమే గెలిచింది HMS రియాజ్ అహ్మద్

*సింగరేణి కార్మికుల పక్షాన న్యాయమైన హక్కులకోసం పోరాడే సింగమలై రియాజ్ అహ్మద్ పై దాడిచేస్తూ అన్యాయంగా అర్థరాత్రి ఆఫీస్ ను కూల్చి, అట్రాసిటీ కేసులు పెట్టించి, అన్నలతో సంబందాలంన్నాయని అక్రమంగా ఆరు కేసులను పెట్టించిన గత కార్మక వ్యతిరేకి‌, కే.సీ.ఆర్. ఏజెంట్ లా ప్రవర్తించి సింగరేణి సంస్థను కే.సి.ఆర్ కు తాకట్టుపెట్టి 28 వేల కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వానికి దారదత్తంచేసిన నడిమెట్ల శ్రీధర్ 

*తోటి జాతీయ సంఘం నాయకునిపై ఇంత అన్యాయంగా ఆఫీసుకూల్చేసి అక్రమకేసులు పెడుతుంటే అడ్డుకోవాల్సిన గత గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యం తొత్తులుగా వ్యవహరించి శునకానందం పొందడం శోచనీయం అని సింగరేణి కార్మికులు గమనించాలని విన్నవిస్తూ, 

*అన్యాయాలకు చెరమగీతం పాడి తప్పుడుకేసులు పెట్టిన నడిమెట్లకు మొట్టకాయలు వేసినట్టు న్యాయస్థానం  రియాజ్ అహ్మద్ పై పెట్టిన కేసులన్నీ భూటకమని కొట్టివేయడం జరిగింది. 

*సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కులకోసం అలుపెరుగని పోరాటాలు చేసే H.M.S. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కడిగినముత్యంలా కేసులన్నీ కొట్టివేయడమే వీటికి నిదర్శనం.

*అబద్దం అప్పటివరకే గెలిచినట్టు కనబడుతుంది కానీ చివరకు న్యాయానికి తలవంచక తప్పదని న్యాయస్థానం తీర్పుకు సలాం చేస్తున్న సింగరేణి కార్మికులు 

* జై H.M.S. జై జై సింగరేణి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793