-->

108 అంబులెన్స్ లోనే మహిళ సుఖ ప్రసవం

108 అంబులెన్స్ లోనే మహిళ సుఖ ప్రసవం

 108 అంబులెన్స్ లోనే మహిళ సుఖ ప్రసవం

నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలంలోని విట్టోలి గ్రామానికి చెందిన గంగసాగర అనే మహిళకు  శుక్రవారం తెల్లవారు జామున పురిటినొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. 

సిబ్బంది గంగసాగర అనే మహిళను ఆసుపత్రికి తర లించే క్రమంలో మహిళకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో తరోడా గ్రామ సమీపంలో 108 సిబ్బంది అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం చేశారు.

 గంగ సాగర 3వ కాన్పులో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

మెరుగైన చికిత్స కోసం  భైంసా ఆసుపత్రికి తరలించారు. మహిళకు సుఖ ప్రసవం చేసిన 108 సిబ్బందికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793