మోడ్రన్ ఇఖ్రా స్కూల్లో సైబర్ నేరాల అవగాహన సదస్సు
మోడ్రన్ ఇఖ్రా స్కూల్లో సైబర్ నేరాల అవగాహన సదస్సు
నేటి ఆధునిక యుగంలో ప్రపంచంలో అతి పెద్ద నేరాల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాల సేవనం ముందంజేలో ఉన్నాయి అని మానవ అక్రమ నివారణ కొత్త గూడెం అధికారి శ్రీనివాస్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సుభాష్ చంద్రబోస్ నగర్ లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్లో సైబర్ నేరాల అవగాహన సదస్సు లో విద్యార్థులకు ఆయన మాట్లాడుతూ
నేడు సులభంగా డబ్బు సంపాదించాడానికి మానవ అక్రమ రవాణా అతి పెద్ద సాధనంగా మారిందని, ముఖ్యంగా ఆడపిల్లలకు మాయమాటలతో మభ్య పెట్టి వారిని బిచ్చగాళ్లగా, వ్యభిచార గృహాలకు అమ్ముతున్నారని అలాంటి మాయగాళ్ళ మాయలో పడరాదని హెచ్చరించారు.
అబ్బాయిలకు గంజాయి లాంటి మత్తు ముందులకు అలవాటు చేసి వారితో నేరాలు చేయిస్తున్నారని అపరిచితుల తో జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు.
18 సంవత్సరాలు నిండిన వారు లైసెన్స్ తీసుకున్న తర్వాత వాహానాలు నడపాలని అన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 100 కు డైల్ చేసి పోలీసుల సహాయం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్, హెడ్ కానిస్టేబుల్ నాగయ్య, ప్రధాన అద్యాపకురాలు పర్వీన్ సుల్తానా, టిచర్స్ నీల, ప్రసన్న, నుసరత్, ఖాజ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment