-->

317 జీవోపై సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

317 జీవోపై సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం


317 జీవోపై సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

 317 జీవోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యింది. 

క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 

317 జీవోపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. 

ఈరోజు జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమాచారం అందించినా ... మరికొన్ని శాఖల నుండి 317 జీవో బాధిత ఉద్యోగులకు సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం రావాల్సి ఉందని క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. 

317 జీవో కింద వివిధ ప్రభుత్వ శాఖల  ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన మీదట 30 నుండి 40 శాతం మంది ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు పునరావృత్తం అయినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ గుర్తించింది. 

క్యాబినెట్ సబ్ కమిటీ 317 జీవో వెసులుబాటుకు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలానే ఉద్దేశానికి వ్యతిరేకంగా కొంతమంది ఈ వెసులుబాటును ఉపయోగించుకొని వారి వారి సొంత జిల్లాకు పోవాలనే ప్రయత్నంలో కమిటీ దృష్టికి తెచ్చారు.

ఎవరికైతే 317 జీవో లో అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో వారిని గుర్తించి వారి వివరాలను త్వరలో కమిటీకి అందజేయాలని అధికారులను  క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది.

క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, GAD ముఖ్య కార్యదర్శి మహేష్ కుమార్ ఎక్కా దత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, శివశంకర్ PRC చైర్మన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, ప్రిన్సిపల్ సెక్రెటరీ నదిమ్, లా సెక్రెటరీ తిరుపతి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్  దేవసేన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని, సోషల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి N. శ్రీధర్, విద్యా శాఖ సంచాలకులు వెంకట నరసింహ రెడ్డి, బూసని వెంకటేశ్వరరావు తదితర వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793