మహంకాళి రథోత్సవంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా
మహంకాళి రథోత్సవంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూడిది గడ్డ లో వేంచేసి ఉన్న మహంకాళి దేవాలయం రథోత్సవంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జరుపుకునే పండుగ బోనాల పండుగ అన్నారు.
పట్టణంలోని భూమి మహంకాళి దేవాలయంలో శుక్రవారం మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా జరిగిన రథోత్సవంలో ఆయన పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు,
కాళీ ఉపాసకులు నరేంద్ర భవాని స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాలువా, పులమాలతో ఘనంగా సత్కరించారు. అనాదిగా వస్తున్న సాంస్కృతి సంప్రదాయాలను ఆచరిస్తూ వాటిని కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఇలాంటి ఉత్సవాలకు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని రాగద్వేషాలు వీడనాడి ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడిస్తే సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు మెండుగా పండాలని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పండుగలు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కౌన్సిలర్ విజయ్ కుమార్, నాయకులు గోనే సురేష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment