-->

ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 27 మృతి

ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 27 మృతి

 ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 27 మృతి

ఉత్తరప్రదేశ్‌ లోఈరోజు విషాదం చోటు చేసుకుంది. హత్రాస్‌లో జరిగిన ఓ మత పరమైన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. పలువు రు తీవ్రంగా గాయపడ్డారు. 

రతీభాన్‌పూర్‌లో మంగళ వారం శివుడికి సంబంధిం చిన ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముగియగానే స్థానికులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. 

ఈ తొక్కిసలాటలో సుమా రు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం. 

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్క డికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఇటా మెడికల్‌ కాలేజీకి తరలించారు. ఇక మృతుల సంఖ్య పెరిగే ఆవకాశం ఉంది...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793