ఇండియన్ ఆయిల్ బంక్ లో 35వేల రూపాయల చోరీ..
ఇండియన్ ఆయిల్ బంక్ లో 35వేల రూపాయల చోరీ..
జనగామ జిల్లా: దేవరుప్పుల మండల కేంద్రంలోని సూర్యాపేట నుండి జనగామకు వెళ్ళే రహదారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద 1:10 గంటలకు డీజిల్ కోసం ఆటోలో వచ్చి ఆటోను పక్కన నిలిపి అందులోంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి దిగి డీజిల్ కోసం అటూ ఇటూ చూసి తిన్నగా ఆఫిస్ రూంలోకి వెళ్ళాడు.
బంక్ లో పనిచేసే నరేష్, నర్సింహా ఇద్దరు అక్కడ నిద్రిస్తుండగా ఐదు నిమిషాల పాటు డీజిల్ పోయాలని వారిని లేపాడు. వాళ్ళు ఎంతకీ లేవకపోగా పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో డబ్బులు కనిపించేసరికి ఆ వ్యక్తి డబ్బుల కట్ట ఒకటి చేత్తో పట్టుకొని జేబులో వేసుకుని అక్కడినుంచి 1:20 గంటలకు వెళ్ళిపోయాడు.
ఉదయం నరేష్,నర్సింహాలు లేచి టేబుల్ డ్రాలో చూసేసరికి 35వేల రూపాయల డబ్బుల కట్ట కనిపించకపోవడంతో కంగారు పడి బంక్ యజమాని రవీందర్ కు ఫోన్ లో విషయం తెలిపి వెంటనే సిసీ ఫుటేజ్ లో గుర్తుతెలియని వ్యక్తి చోరికి పాల్పడినట్లు తెలిసింది. రవీందర్ సూచన మేరకు నరేష్, నర్సింహా లు ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment