-->

చర్చ లేకుండానే చట్టాలు చేయడం దారుణం న్యాయవాదుల నిరసన

 
చర్చ లేకుండానే చట్టాలు చేయడం దారుణం న్యాయవాదుల నిరసన

*కొత్త నేర చట్టాలపై సమీక్ష జరగాలి.
*కలెక్టరేట్ ఎదుట న్యాయవాదుల నిరసన.
*చర్చ లేకుండానే చట్టాలు చేయడం దారుణం. 
*ఇవి అనాగరిక చట్టాలంటూ నినాదాలు!!
*కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు.

రాయచోటి : పార్లమెంటులో ఎలాంటి చర్చ జరపకుండానే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త నేర చట్టాల పై తిరిగి సమీక్ష జరపాలని అంతవరకు చట్టాల అమలు చేయడం ఆపివేయాలని రాయచోటి న్యాయవాదులు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదురుగా  బుధవారం నిరసన తెలియజేశారు. 

అంతకుముందు రాయచోటిలో ని కోర్టు విధులను వారు బహిష్కరించారు. రాయచోటి బార్  అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. రెడ్డయ్య భారత న్యాయవాదుల సంఘం కడప ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్, సహాయ కార్యదర్శి డి. నాగ ముని నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితులు తమకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి బాధ్యులను అదుపులోనికి తీసుకొని కేసును విచారణ జరపాలని ఉండగా, కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఎఫ్. ఐ. ఆర్ నమోదు చేయకుండానే  జరిగిన సంఘటనపై పోలీసులు ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయవచ్చునని నిబంధన పెట్టడం బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని దీనితో పోలీసులకు అపరిమిత అధికారాలు  వచ్చి ఇష్టం వచ్చినట్లు చేసే అవకాశం ఉందని వారు అన్నారు. రిమాండ్ కు తరలించిన తర్వాత 15 రోజుల్లోగా ముద్దాయిలను పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఇప్పటివరకు ఉండగా నూతన చట్టాలతో 90 రోజుల వరకు పోలీసులు కస్టడీలోనికి తీసుకొనే అధికారం పోలీసులకి ఇచ్చారు. 

ఇవ్వడం దారుణమన్నారు. ఈ నిబంధన తో చాలాకాలం వరకు ముద్దాయిలు జైల్లో మగ్గాల్సి వస్తుందని వారన్నారు. బ్రిటిష్ వారు తెచ్చిన రాజా ద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయగా కొత్త నేర చట్టాలలో దానిని మరింత కఠిన తరం చేసి దేశద్రోహం చట్టంగా మార్చడం రాజ్యాంగంలోని బావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 కు,  జీవించే హక్కు ఆర్టికల్ 21 కి ఇది పూర్తిగా విరుద్ధమన్నారు.

 ముద్దాయిలను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో సంకెళ్లు వేయకూడదని సుప్రీంకోర్టు ఎన్నో తీర్పుల్లో చెప్పినప్పటికీ సంకెళ్లు వేయవచ్చునని ఏకంగా చట్టాన్ని చేయడం దారుణం అన్నారు. పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినప్పటికీ అది ఇంగ్లీషులో మాత్రమే ఉండాలని ఆర్టికల్ 348లో ఉండగా ఐపిసి, సిఆర్పిసి ఎవిడెన్స్ లకు అర్థం కాని భాషల తో వాటి పేర్లను మార్చివేసి గందరగోళం చేశారని వారు విమర్శించారు. 

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను  గాని భారత రాజ్యాంగాన్ని గాని ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరితోనూ చర్చించకుండా తీసుకొచ్చిన కొత్త నేర చుట్టాల సమీక్ష జరిగినంతవరకు ప్రజలందరూ ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు ధనుంజయ్ కుమార్, చిన్నయ్య, ఆనంద్ కుమార్ ,హుమాయూన్ భాష, రవిశంకర్, ఖాదర్ బాషా,  నిరంజన్, ఖిజరలి, ఉత్తేజ్ కుమార్, చంద్రశేఖర్, నాగాంజనేయులు  పాల్గొన్నారు


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793