-->

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచండి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచండి: మంత్రి శ్రీధర్ బాబు

 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచండి: మంత్రి శ్రీధర్ బాబు

భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకునాణ్యమైన విద్యను అందించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. డిగ్రీ, పీజీ, బీఈడీ, టీటీసీ చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన ఉంటుందని, పాఠశాలల్లో  విద్యార్థుల హాజరు శాతం పెంచాలని రాష్ట్ర పరిశ్ర మలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 

బుధవారం మల్హర్ రావు   మండలం వల్లెంకుంట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.12 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ఈరోజు ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన జరిగేందుకు ప్రభుత్వం పాఠశాలల మరమ్మతుల కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల హాజరు శాతాన్ని  పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

8 మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో 36 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నా రని, బడిబాట కార్యక్రమం లో విద్యార్థుల నమోదుకు చేపట్టిన చర్యలను ప్రధానో పాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. 

ప్రాథమిక  పాఠశాలలో  48 మంది విద్యార్థులున్నారని, మధ్యాహ్న భోజన పథకాని కి గ్యాస్ మంజూరు చేస్తున్న ట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఫోటోలు దిగి బాగా చదువు కోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా ఉపాధ్యా యులు సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరగా.. స్పదించిన మంత్రి అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా 317 రాష్ట్రపతి ఉత్తర్వులు తయారు చేశారన్నారు. ఉద్యోగుల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం  సవరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. 

బుధవారం మలహార్ మండలంలోని కొయ్యూరు నుండి రుద్రారం వరకు 20 కోట్ల వ్యయం తో నిర్మించనున్న రోడ్డు విస్తీర్ణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే జడ్పి సీఈవో విజయలక్ష్మి, డిఆర్డిఓ నరేష్, పంచాయతీరాజ్ ఈ ఈ దిలీప్, మండల ప్రత్యేక అధికారి అవినాష్, చింతల పల్లి ఎంపీపీ మలహల్ రావు,జెడ్పీటీసీ అయిత కోమల రాజిరెడ్డి,తోపాటు..

డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, తాడిచెర్ల పిఏసిఎస్ తాత్కాలిక చైర్మన్ ఇప్ప మొoడయ్య,మాజీ జెడ్పీటీసీ కొండ రాజమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.....

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793