-->

ప్రజాసమస్యలపై ఎమ్మెల్యే కూనంనేని సమీక్షా సమావేశంలో నాగా సీతారాములు

ప్రజాసమస్యలపై ఎమ్మెల్యే కూనంనేని సమీక్షా సమావేశంలో నాగా సీతారాములు

ప్రజాసమస్యలపై ఎమ్మెల్యే కూనంనేని సమీక్షా సమావేశంలో నాగా సీతారాములు 

సుజాతనగర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో కూనంనేని ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని గ్రామాల్లో ప్రధాన సమస్యలైనా కరెంటు రోడ్లు డ్రైనేజీలు కల్వర్టులు బ్రిడ్జిలు పనులను పూర్తి చేస్తామని, మంగపేట గ్రామంలో ఇండస్ట్రీలను ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని  కేటీపీఎస్ మూసివేస్తే దాని స్థానంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు కు కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఐటి హబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

సుజాతనగర్ లో జూనియర్ కాలేజీ ఏర్పాటు కోసం అధ్యయనం చేసి ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు వేపలగడ్డలోని స్మశాన వాటిక వెళ్లడానికి ఏర్పాటు చేస్తానన్నారు మీ అందరి సహాయ సహకారములతో అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగిందని పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సేవ చేస్తానని ప్రజా సమస్యల పైన నిరంతరం సేవ చేస్తానని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మండే వీరహనుమంతు రావు, ఎమ్మార్వో గుడి చుట్టూ శిరీష, ఎంపీపీ భూక్య పద్మావతి ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఇరిగేషన్ డిఈ భాస్కర్,  ఎంపీటీసీలు కసన బోయిన భద్రం, గణేష్, కాంగ్రెస్ నాయకులు చింతలపుడి రాజశేఖర్, మడిపల్లి శ్రీనివాస్, లోశేట్టి నాగార్జున, సిపిఎం నాయకులు వీర్ల రమేష్, కున్సోత్ ధర్మా, సిపిఐ నాయకులు దశ్రు, కుమారి హనుమంతరావు  ఏఐటీయూసీ మండల అధ్యక్షులు వీర్ల మల్లేష్, వీర్ల దుర్గాప్రసాద్, సిపిఐ మండల నాయకులు కుమారి కృష్ణ బొడ్డు కేశవరావు, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793