టిపిసిసి ప్రెసిడెంట్ గా పోరిక బలరాం నాయక్ నియమించాలని ఆదివాసి గిరిజన సంఘాలు కాంగ్రెస్ కు వినతి
టిపిసిసి ప్రెసిడెంట్ గా పోరిక బలరాం నాయక్ నియమించాలని ఆదివాసి గిరిజన సంఘాలు కాంగ్రెస్ కు వినతి
పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులుని టిపిసిసి ప్రెసిడెంట్ గా నియమించాలని ఆదివాసి గిరిజన సంఘాలు కాంగ్రెస్ అధిష్టానానికి పిలుపు
హనంకొండ నక్కల గుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఆదివాసి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గిరిజన ఐక్య సంఘాల ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. సమావేశాని ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు బానోత్ నవీన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తుడుందెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి బాదావత్ రాజు, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సమ్మయ్య రాథోడ్, BSP ఉమ్మడి జిల్లా కన్వీనర్ కన్నం సునీల్, పాల్గొని మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర సహాయ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా, అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వ్యక్తిగా, అందర్నీ అన్ని కులాలను కలుపుకొని పోయే వివాదరహితుడుగా అనుభవం కలిగిన వ్యక్తిగా,
మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో మూడున్నర లక్షల అత్యధిక భారీ మెజార్టీతో విజయం సాధించి ఆదివాసి గిరిజనుల ఆదరాభిమానాలు పొందిన నాయకుడు బలరాం నాయక్, సామాజికంగా అన్ని వర్గాల కోసం పనిచేసే వ్యక్తిత్వం కల వ్యక్తి కావున బలరాం నాయక్ ని టీపీసీసీ ప్రెసిడెంట్ చేయాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అలాగే సోనియా గాంధీ, జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్చార్జ్ దీప్దాస్ మున్సి, రాష్ట్ర మంత్రివర్గాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అందర్నీ సవినయంగా విన్నవిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్టీ తెగలలో ఎవ్వరికి ఈ పదవి దక్కలేదు. AICC, TPCC స్థాయిలో బలరాం నాయక్ గారికి అధిష్టానం పెద్దలతో సత్సంబంధాలు ఉన్న కారణంగా TPCC ప్రెసిడెంట్ గా నియమించాలని కోరడం జరిగింది.
గతంలో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రావడానికి గిరిజన ఆదివాసి తెగలే కారణమని వారి అండ దండలతోనే ఈ ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగిందని పలుమార్లు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మా ఎంపీ పోరిక బలరాం నాయక్ గారికి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలని జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానానికి, గిరిజన ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మా విజ్ఞప్తి.
ఈ సమావేశంలో తెలుగు యూనివర్సిటీ విద్యార్థి ప్రొఫెసర్ బాబురావు, ప్రొఫెసర్ సమూలాల్ నాయక్, ఐఓసీఎల్ రిటైర్డ్ ఎంప్లాయ్ నందా నాయక్, ఎన్ఐటి రిటైర్డ్ ఎంప్లాయ్ సామల నాయక్, ప్రొఫెసర్ బూర ముత్యలింగం, లంబాడ లైవ్ ఐక్యవేదిక డిస్టిక్ అధ్యక్షులు లావుడియా రాజు నాయక్, భూక్య మోహన్ మాజీ జెడ్పిటిసి వీరమ్మ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షురాలు జయ బాయ్, మహిళా ఉద్యోగుల సంఘం జిల్లా నాయకురాలు మహిళా ఉద్యోగుల సంఘం జిల్లా నాయకురాలు అర్పిత, యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మేడా రంజిత్ కుమార్, రాజ్ కుమార్, కూడా కిషన్ నాయక్ బంగారు నాయక్, సుధాకర్ నాయక్ ఉషణ

Post a Comment