కిన్నెరసాని పైప్ పగిలిన ప్రాంతాన్ని సందర్శించిన సిపిఐ కౌన్సిలర్ ల బృందం
కిన్నెరసాని పైప్ పగిలిన ప్రాంతాన్ని సందర్శించిన సిపిఐ కౌన్సిలర్ ల బృందం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ కిన్నెరసాని పైపు లైన్ పగిలిన ప్రాంతాన్ని కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి sk. సాబీర్ పాషా ఆదేశానుసారం కిన్నెరసాని పైప్ లైన్ పగిలిన ప్రాంతాన్ని సందర్శించిన సిపిఐ కౌన్సిలర్ ల బృందం.
యుద్ధప్రాతిపదికన జరుగుతున్న పైప్ లైన్ పనుల పని తీరును పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు లీకేజీ పనులు పూర్తి చేసి త్వరితగతిన కిన్నెరసాని నీరు ప్రజలకు అందించాలని అధికారులను కోరారు.
త్వరగా అదిరిపోయే వరంగల్ సిమెంట్ తెప్పించి లీకు పనులు చేయాలని అధికారుల ను సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో సిపిఐ కౌన్సిలర్లు కొలపూరి ధర్మరాజు, మాచర్ల శ్రీను, బోయిన విజయ్, పోలోజు సత్యనారాయణ చారి, కందుకూరు ఈశ్వర్, మొహమ్మద్ యూసుఫ్ తదితరులు సందర్శించిన్నారు.

Post a Comment