పెద్దవాగు ముంపు బాధితులకు సిపిఐ ఆధ్వర్యంలో బట్టలు నిత్యావసరాల పంపిణి
పెద్దవాగు ముంపు బాధితులకు సిపిఐ ఆధ్వర్యంలో బట్టలు నిత్యావసరాల పంపిణి
🔸 నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
🔸 ప్రాజెక్ట్ మారమ్మతులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి
👉 సీపీఐ భద్రాద్రి, ఏలూరు జిల్లాల కార్యదర్శులు ఎస్ కే సాబీర్ పాషా, కృష్ణ చైతన్య
ఆశ్వరవుపేట : అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టు వరద ముంపుకు గురైన బాధితులకు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సుమారు రూ.2 లక్షలు విలువైన బట్టలు, బియ్యం, నిత్యావసర సరుకులును బుధవారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి కృష్ణ చైతన్య. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్. జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ డి సలీమ్ ఆధ్వర్యంలో అందించారు.
ఈ సందర్బంగా ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ గత పాలకుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా పెద్ద వాగు ప్రాజెక్టుకు గండిపడిందని, ఈ ప్రాజెక్ట్ ను నమ్ముకున్న రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని అన్నారు. ప్రభుత్వం నష్టం పోయిన రైతులకు పరిహారంగా ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని, ఉసుక మెటలను ప్రభుత్వం ఖర్చులతో తొలగించి రైతులకు భరోసా అందించాలని డిమాండ్ చేశారు,
ప్రాజెక్టు కట్ట పుననిర్మాణం కోసం నిధులు కేటాయించి తక్షణం పనులు ప్రారంభం చేసి రెండు రాష్టాల రైతు లను ఆదుకోవాలి అని కోరునారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు రామకృష్ణ, రవి, దారయ్య,సాయి బాబు, ముక్కంటి, చిన్నయ్య, అర్జన్ట్, పుట్ట సత్యం,రెడ్డి, సత్యవతి, బేగం, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment