-->

కొత్తగూడెం తల్లిని హత్య చేసి కొడుకు ఉరి వేసుకోని ఆత్మహత్య

కొత్తగూడెం తల్లిని హత్య చేసి కొడుకు ఉరి వేసుకోని ఆత్మహత్య
తల్లిని హత్య చేసి కొడుకు ఉరి వేసుకోని ఆత్మహత్య

 కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బూడిదిగడ్డలో తల్లిని హత్య చేసి కొడుకు ఉరి వేసుకున్న ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి.

కొడుకు వినయ్ కుమార్ పాసి (28)తల్లి తుల్జా కుమారి పాసి (55) నీ శుక్రవారం రాత్రి రాడ్డుతో ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని తలపై కొట్టి చంపినట్టు సమాచారం అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు వినయ్ కుమార్ పాసి

తల్లి కొడుకుల పోషణ మరిది గుల్లపల్లి రవిశంకర్ (మాజీ కౌన్సిలర్ )చూస్తూ ఉంటారు. తల్లి తుల్జ్ శనివారం రాత్రి రవిశంకర్ ఇంటిలో భోజనం చేసి కొడుకు కు భోజనం తీసుకువెళ్ళింది.కుమారి ఇంటి పక్కనే కూతురు,అల్లుడు పాసినాగేందర్ నివాసం ఉంటారు. 

శనివారం ఉదయం తొమ్మిది అయినప్పటికీ తుల్జా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమే మనవరాలు సునన్య ఇంట్లోకి వెళ్లి చూడగా (లోపల గడి పెట్టుకోకపోవడంతో) రెండు మృతదేహాలు కనిపించాయి. దీంతో విషయాన్ని పెద్దలకు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుకున్నారు.

కొత్తగూడెం డిఎస్పి షేక్ అబ్దుల్ రెహమాన్, త్రీటౌన్ సిిఐ శివప్రసాద్ పరిశీలించారు. క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది.కాగా కొడుకు వినయ్ కుమార్ పాసి  పాల్వంచలో బేకరీలో  పనిచేశాడు, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793