బోనాల పండుగకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు: రాచకొండ సిపీ
బోనాల పండుగకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు: రాచకొండ సిపీ
హైదరాబాద్ లో రేపు ఎల్లుండి నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కోరారు.
ప్రజల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు శనివారం అధికారులను ఆదేశించారు.
సున్నితమైన ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక వేడుకల వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
అన్ని ప్రముఖ దేవాలయ ప్రాంగణాల్లో వాహనాల నంబర్ ప్లేట్ల చెకింగ్, పత్రాల చెకింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రదేశాల్లో బాంబు తనిఖీ బృందాల ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
మత కల్లోలాలు రెచ్చగొట్టే పాత నేరస్తుల మీద నిఘా వేసిఉంచాలని, వారు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Post a Comment