భద్రాచలం గోదావరి మహోగ్రరూపం:మూడో ప్రమాద హెచ్చరిక జారీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలం గోదావరి మహోగ్రరూపం:మూడో ప్రమాద హెచ్చరిక జారీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాది జిల్లా : గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరదలతో ఉరకలేస్తున్న గోదావరి భద్రాచలం దగ్గర ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గంటగంటకూ పెరుగుతున్న ఉధృతితో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది.
నదిలో ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరదల ప్రభావంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రెండు ప్రధాన రహదారులపై గోదావరి వరదనీరు చేరింది. మరోవైపు గోదారి మహోగ్ర రూపంతో పరివాహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వరదలతో జనం అల్లాడు తున్నారు. మూటాముళ్లె సర్దుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు సాయం కోసం చూస్తున్నారు. వరద రోజురోజుకూ పెరుగు తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకారంగా గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం క్రమేపి పెరుగుతూ వస్తున్నదని ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణం వద్ద 28.07.24 సాయంత్రం 4:16 గంటలకు నీటి ప్రవాహం 53 అడుగుల స్థాయికి చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లు కు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Post a Comment