-->

రూ.50 లక్షల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

రూ.50 లక్షల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

రూ.50 లక్షల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో జరిగిన రూ. 50 లక్షల రూపాయల చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, 7 మంది పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ. 16 లక్షల నగదు, నాలుగు సెల్ ఫోన్లు, ఒక ఇనోవా కారు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ లోని భారతి ట్రేడర్స్ లో గత నెల 21వ తేదీన రూ.50 లక్షల నగదు చోరీ జరిగిందని ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి శంషాబాద్ సీసీఎస్ పోలీసులు, రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు, మైలార్దేవ్పల్లి పోలీసులు దర్యాప్తు నిర్వహించగా 11మంది నిందితులు ఉన్నారని గుర్తించారు. 11 మంది నిందితుల్లో నలుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని, మరో ఏడు మంది నిందితులు పరారీలో ఉన్నారన్నారు. 

ఈ నిందితులు కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఎక్కువగా నగదు ఏ కంపెనీకి డెలివరీ అవుతుందని రెక్కీ నిర్వహించి ఈ దొంగతనం చేయడం జరిగిందన్నారు. వీరిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు ఉన్నాయన్నారు.

దొంగతనం చేయడానికి ప్రైవేట్ ట్రావెల్స్ లో ఇన్నోవాకార్ ను అద్దెకు తీసుకొని దానికి ఫేక్ నంబర్ ప్లేట్ పెట్టి పక్కాగా డబ్బులు ఉన్నాయని విషయాన్ని గుర్తిస్తారన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీన ప్రగతి ట్రేడర్స్ లో ఉన్న నగదును ఎత్తుకెళ్లారన్నారు. 

11 మంది నిధితుల్లో, నలుగురు అరెస్ట్, అరెస్ట్ అయిన నిందితులు మైలార్దేవ్ పలికి చెందిన షేక్ మహమ్మద్, షేక్ హడన్, మహమ్మద్ షఫి, సయ్యద్ మోహిళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 16 లక్షల నగదు, నాలుగు సెల్ ఫోన్లు, ఒక ఇనోవా కారు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని వారిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.


Blogger ఆధారితం.